పుచ్చలపల్లి సుందరయ్య ఆశయం నేటి తరానికి స్పూర్తి

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయం నేటి తరానికి స్పూర్తి
- గొడిశాల వెంకన్న , సిపిఎం పార్టీ మండల కార్యదర్శి
కేసముద్రం, ఆంధ్రప్రభ : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయం నేటి తరానికి స్పూర్తి దాయకమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదర్శా లకు కట్టుబడి సమానత్వ సమాజమే లక్ష్యంగా జీవించిన మహనీయుడు మహా మానవతవాది కామ్రేడ్. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతినీ పురస్కరించుకొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వినమ్రంగ విప్లవ జోహార్లు తెల్పడమైనది.
ఈ సందర్భంగా గోడిశాల వెంకన్న మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాత్రీ విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య రాచరిక పాలనకు వ్యతిరేకంగా నిలబడి మడమ తిప్పని యోధునిగా చరిత్రకెక్కిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సుందరయ్య అని కొనియాడారు. ఆ మహనీయుని బాటలో కమ్యూనిస్టులు అందరూ ఐక్యమై ముందుకు సాగి మతోన్మాద పెనుభుతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్టులందరూ సుందరీలు ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
