నాణ్యమైన విద్యుత్ అందించాలి..

నాణ్యమైన విద్యుత్ అందించాలి..
పద్మావతి కాలనీలో నూతన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ స్వప్న
మోత్కూర్, ఆంధ్రప్రభ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య అన్నారు. మంగళవారం పద్మావతి కాలనీలో లో వోల్టేజ్ నివారణ కోసం నూతనంగా మంజూరైన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ను మున్సిపల్ చైర్మన్ స్వప్న,ట్రాన్స్కో ఏ ఈ ప్రభాకర్ రెడ్డి తో కలిసి స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు .ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డ్ కౌన్సిలర్ మెంట రమణ నగేష్,మాజీ కౌన్సిలర్ కూరేళ్ల కుమారస్వామి, లైన్ మెన్లు గూడూరు జాన్ రెడ్డి , మచ్చగిరి,జె ఎల్ ఎం భాస్కర్, కాలనీ వాసులు ఎడ్ల సుదర్శన్, ప్రవీణ్,గడ్డం లక్ష్మయ్య,సతీష్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.
