జలసిరి అమలులో సమన్వయమే కీలకం

మునుగోడు, ఆంధ్రప్రభ: తెలంగాణ జలసిరి–వీబీజీ రామ్‌జీ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మునుగోడు ఎంపీడీఓ పి. వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.

మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జలసిరి–వీబీజీ రామ్‌జీ కార్యక్రమంపై మండలస్థాయి ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై సర్పంచులు, అధికారులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి, వర్షపు నీటి నిల్వపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఏపీఓ, ఏపీఎం, మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఓఏలు, వీబీజీ రామ్‌జీ సిబ్బంది పాల్గొన్నారు.