TG | ఎమ్మెల్యే క్యాంపు వద్ద ఉద్రిక్తత..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్, కాంగ్రెస్ నేత షబ్బీర్ సవాళ్లు విసురుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు కారు ధ్వంసం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరోరా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు భారీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, ప్రభుత్వ సలాహాదారు షబ్బీర్ అలీ సవాళ్ల మద్య కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. ఇరువురు పరస్పర ఆరోపణలతో బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సై అనడం శనివారం కామారెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదారాలతో వస్తా అని ఎమ్మెల్యే చెప్పడం.. తాము సవాల్ స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ చెప్పడంతో కామారెడ్డిలో శనివారం ఉదయం నుంచి పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇరువర్గాలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కాగా కామారెడ్డిలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఎమ్మెల్యే సూచన మేరకు కార్యకర్తలు ఎవరూ క్యాంప్ కార్యాలయం వైపు రాలేదు. అయినా క్యాంప్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోసానిపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తన కారులో క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. క్యాంప్ ఆఫీసుకు కాంగ్రెస్ నాయకుడు రావడంపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహేందర్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ వెళ్లి కారును ఎత్తి పడేశారు. దాంతో స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటికి పోలీసులు కారును టోచన్ సహాయంతో తరలించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు.

మహేందర్ రెడ్డి ఇక్కడికి రావాలని, క్యాంప్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోగా కొందరు కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారుకు నిప్పుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను పక్కకు తరలించి నీళ్లతో మంటలను ఆర్పివేసి కారును తరలించారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు వచ్చి అరెస్ట్ చేసిన తమ కార్యకర్తను పంపించాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు.

బీజేపీ నాయకులు
ఎమ్మెల్యే సూచన మేరకు తాము శాంతియుతంగా ఎలాంటి ఆందోళన చేయకుండా ఉన్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు పోలీసుల కళ్లుగప్పి క్యాంప్ కార్యాలయానికి ఎలా వస్తాడని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా పోలీసుల నిఘా వైఫల్యమేనని ఆరోపించారు. కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపును స్వాగతించాడని, ఎమ్మెల్యే సూపర్ అంటూ మెసేజ్ చేశాడని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విడ్డురంగా ఉందన్నారు.