సంజీవిని సేవలు ఆదర్శప్రాయం

సంజీవిని సేవలు ఆదర్శప్రాయం

  • 35 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు
  • సంక్షేమ శాఖ అధికారి కె.లలితాకుమారి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంజీవిని తన ఉద్యోగ జీవితంలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి శాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని సంక్షేమ శాఖ అధికారి కె.లలితాకుమారి కొనియాడారు. 35 ఏండ్ల పాటు విశిష్ట సేవలందించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు జోగిపేట సీనియర్ అసిస్టెంట్ జె.సంజీవని ఉద్యోగ విరమణ శనివారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.లలితా కుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 1991 సెప్టెంబర్ 18న శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, తుది వరకు వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని గుర్తు చేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన పలు ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా నిర్వహణలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతర జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సంజీవిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పలువురు సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply