Zaheerabad | తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

Zaheerabad | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : డీడీఎస్ –కృషి విజ్ఞాన కేంద్రం (కె.వి.కె), జహీరాబాద్ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై వారం రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సస్య రక్షణ శాస్త్రవేత్త ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2 నుండి 7 వరకు ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, నిర్వహణ, వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి గల రైతులు, యువత, మహిళలు ఈ శిక్షణకు హాజరయ్యే వారు ముందుగా 81060 71634 నంబరుకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply