మోడల్ యునైటెడ్ నేషన్‌లో సంగారెడ్డి విద్యార్థుల ప్రతిభ
మోడల్ యునైటెడ్ నేషన్‌లో సంగారెడ్డి విద్యార్థుల ప్రతిభ
- అభినందించిన డీఈఓ ఎస్.వెంకటేశ్వర్లు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని టీజీఐఆర్‌డీలో ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో మొత్తం ఆరు అవార్డులను కైవసం చేసుకుని జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటారు. కార్యక్రమంలో ఏఎస్పీడీ రాధారెడ్డి విజేతలను ప్రకటించి బహుమతులను అందజేశారు.
యూఎన్‌డీపీ కమిటీ విభాగంలో హై కమాండేషన్ అవార్డును జడ్‌పీహెచ్‌ఎస్ దౌలతాబాద్‌కు చెందిన అనమికరాయి, జడ్‌పీహెచ్‌ఎస్ నందికందికి చెందిన కార్తికేయ చారి అందుకున్నారు. స్పెషల్ మెన్షన్ విభాగంలో జడ్‌పీహెచ్‌ఎస్ చర్యాలకు చెందిన ఆరాధ్య, జడ్‌పీహెచ్‌ఎస్ సిరిపురకు చెందిన హరి ప్రకాష్, టీజీడబ్ల్యూఆర్‌ఎస్ సింగూర్‌కు చెందిన రిషి అరుణ్ వర్ధన్ ప్రతిభ కనబరిచారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ కమిటీ విభాగంలో జడ్‌పీహెచ్‌ఎస్ న్యాల్కల్‌కు చెందిన జిక్రా మహిన్ స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రామ్‌రెడ్డి, నారాయణమ్మ, సంగమేశ్వర్, కవిత విద్యార్థులకు గైడ్ టీచర్లుగా వ్యవహరించారు. రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రతీక్ జైన్, జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు అభినందించారు.
