Singer S. Janaki | మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

Singer S. Janaki | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి తుదిశ్వాస విడిచారు. ఎస్‌.జానకి ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలదు.

జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందారు.