Chief Minister’s Relief Fund | నిరుపేదల పాలిట వరంగా…
Chief Minister’s Relief Fund | నిరుపేదల పాలిట వరంగా…
- బాధిత కుటుంబానికి ఎల్ఓసీ కాపీని అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
Chief Minister’s Relief Fund | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : నిరుపేదల వైద్య అవసరాల విషయంలో అన్ని విధాలుగా అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ రోజు హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, హసన్ పర్తి 66వ డివిజన్ కి చెందిన పిథిమి నాగమణి గుండెకు సంబంధిత సమస్యతో బాధపడుతున్ననేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఎల్ఓసి కాపీని ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎల్ఓసీ ద్వారా హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. స్థానిక శాసనసభ్యుడిగా తన దృష్టికి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యపై తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్రైవేట్ ఆసుపత్రులకు.. చికిత్సల నిమిత్తం వెళ్లి అప్పుల పాలుకాకుండా, ప్రభుత్వ నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో తాను అందించేఎల్ఓసీల ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, 66 డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్ల రవీందర్, గరిగె రాజు, జన్ను అశోక్, జన్ను రమేష్, రామంచ ఐలయ్య, మార్కెట్ డైరెక్టర్ జాడి రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
