చెరువులు, కుంటల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

చెరువులు, కుంటల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

  • సేవాలాల్ సేన నాయకుడు జాటోత్ సురేష్ నాయక్

తొర్రూరు, ఆంధ్రప్రభ: మండలంలోని రెవెన్యూ గ్రామాలు, శివారు తండాల్లో ఉన్న చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి కాపాడుతూ వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సేవాలాల్ సేన మండల నాయకుడు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక చెరువులు ఆక్రమణలకు గురవుతూ తమ అసలు రూపాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షపు నీటిని నిల్వ చేసే సహజ వనరులను సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి కొరత సమస్య తలెత్తదని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై పట్టాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి చెరువులు, కుంటల విస్తీర్ణాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply