సీఐ ఏసుబాబు మానవతా దృక్పథానికి ప్రశంసలు
సకాలంలో స్పందించిన సీఐ ఏసుబాబు….
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లో గురువారం జరిగిన ఓ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళను ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆవు ఢీకొట్టడంతో ఆమె వాహనంతో పాటు కిందపడిపోయింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసుబాబు ఘటనను గమనించి వెంటనే స్పందించారు. గాయపడిన మహిళకు ప్రాథమిక సహాయం అందించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. సీఐ ఏసుబాబు చూపిన మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నియంత్రణకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
