అదుపు తప్పి ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

దేవరకద్ర, ఆంధ్రప్రభ: అదుపు తప్పి ఆటో బోల్తా పడి పదిమందికి గాయాలైన సంఘటన దేవరకద్ర మండల పరిధిలోని డోకూరు స్టేజి దగ్గర చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర నుంచి కౌకుంట్ల కు వెళ్తున్న ఆటో మంగళవారం సాయంత్రం డోకూరు స్టేజీ దగ్గర ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో 108 సిబ్బందికి ఫోన్ చేయగా అంబులెన్స్ అంబులెన్స్ సిబ్బంది అనిల్ షకీల్ వచ్చి గాయాలైన ప్రయాణికులని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.