కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలి

కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలి

  • భాజపా మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తరుగు,తేమ,తాలు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని వాటిని అరికట్టి రైతులకు మేలు చేయాలని నర్సింహులపేట మండల పార్టీ అధ్యక్షుడు సూరబోయిన సతీష్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా కాంటాలైన తర్వాత ధాన్యాన్ని వెంటనే తరలించాలని,కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply