కొత్త గోదాము నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

కొత్త గోదాము నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
- మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో రైతులు తెచ్చే ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా, నూతనంగా నిర్మించిన షెడ్డును గోదాముగా మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
అలాగే ధర్మా రెడ్డి పల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన గోదాము నిర్మాణం చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ కు పంపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో 1000 మందికి సరిపోయే విధంగా ఒక నూతన టార్పాలిన్ షెడ్డు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన వెల్లడించారు.
ఈ సాధారణ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వెల్మినేడు పి.ఎ.సి.ఎస్. చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, బోయ వెంకటేష్, కే. శంకర్, డిల్లి చంద్రకళ, కే. నవీన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఖాన్, సిహెచ్ వెంకట్ రెడ్డి, పబ్బు శ్రీకాంత్, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశం, డి. విజయ్, జె. కృష్ణమూర్తి, చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, మార్కెట్ కమిటీ కార్యదర్శి బి. రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
