Police SI Promotion | ఆరు నెలలు లూప్ లైన్ లో పని చేస్తే ప్రమోషన్
Police SI Promotion | ఆరు నెలలు లూప్ లైన్ లో పని చేస్తే ప్రమోషన్
స్పష్టం చేసిన డిజిపి
ఆంధ్రప్రభ ఎఫెక్ట్
Police SI Promotion | హైదరాబాద్, ఆంధ్రప్రభ : 2012 బ్యాచ్ ఎస్ఐల దుస్థితి… జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన దౌర్భాగ్యం* అని ఆంధ్రప్రభ లో జూన్ 29న ప్రచురితమైన కథనాలకు రాష్ట్ర డిజిపి స్పందించారు. 2012 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు కనీసం ఆరు నెలల పాటు డిప్యూటేషన్ లేదా లూప్ లైన్ లో పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పోలీస్ బాస్ ఈ అంశాలు ప్రకటించారు. 2012 బ్యాచ్ లో 225 మంది సబ్ ఇన్స్పెక్టర్ లుగా ఎంపికై విధులు నిర్వహిస్తుండగా అందులో 107 మంది ఇప్పటికే డిప్యూటేషన్ పూర్తి చేశారని, ఇటీవల 95 మంది అధికారులు డిప్యూటేషన్ పై వెళ్లారన్నారు. మరో 9 మంది అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారని, సబ్ ఇన్స్పెక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కనీసం ఆరు నెలల పాటు డిప్యూటేషన్ లో విధులు నిర్వహించాలని అప్పుడు పదోన్నతులు ఇస్తామని స్పష్టం చేశారు. సీనియార్టీకి ఇబ్బందులేకుండా జూనియర్ లెవరికి పదోన్నతులు ఇవ్వమని ఈ అంశంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

