జిల్లా ఫస్ట్‌తో మెరిసిన చిన్నకోడపాక విద్యార్థులు
జిల్లా ఫస్ట్‌తో మెరిసిన చిన్నకోడపాక విద్యార్థులు
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక
రేగొండ, ఆంధ్రప్రభ: సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ (ఎన్‌ఎంఎంఎస్) స్కాలర్‌షిప్‌కు గోరి కొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదివిన విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించగా, చిన్నకోడపాక ప్రభుత్వ పాఠశాలకు చెందిన గజ్జెల రిషి, కొండపాక వైష్ణవి ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.
విద్యార్థులు 8వ తరగతి పూర్తి చేసి 9వ తరగతిలో ప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందించడంతో వారు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రిషి, వైష్ణవి జిల్లాలో ప్రథమ ర్యాంకులు సాధించి నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
