Cm-Cbn-Distributes : కంగుంది ఖుషీ ఖుషీ Andhra Prabha Top Story
Cm-Cbn-Distributes : కంగుంది ఖుషీ ఖుషీ Andhra Prabha Top Story
- కష్టజీవుల కళ్లల్లో ఆనందం
- 60 ఏళ్ల వివాదానికి తెర
- 460.19 ఎకరాల భూమికి డీకేటీ సట్టాల పంపిణీ
- 322 మంది పేద రైతులకు లబ్ధి
- అధికారిక హక్కు అందజేత
- సీఎం సీబీఎన్ కు రైతులు దండాలు
( ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో )
Cm-Cbn-Distributes : కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అరవై ఏళ్లుగా.. సాగు చేస్తున్న భూమిలో.. అర్హత లేని కర్షకులుగా.. హక్కులేని రైతులుగా అల్లాడి పోతున్న కుప్పం నియోజకవర్గం కంగుంది గ్రామంలో శనివారం మరపురాని పండుగ వాతావరణం నెలకొంది. ఆ రోజు ఉదయం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కంగుంది గ్రామానికి చేరుకున్న టీటీడీ నిధుల నుంచి 130 దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంగుందిలో డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములకు చట్టబద్ధ హక్కు కల్పిస్తూ అర్హులైన రైతులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. ఆరు దశాబ్దాలుగా కంగుంది భూముల వివాదానికి ప్రభుత్వం చట్టబద్ధ పరిష్కారం కల్పించింది. 1960 నుంచి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న భూముల సమస్యకు కూటమి ప్రభుత్వం తెరదించింది. గ్రామసభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం డీకేటీ పట్టాల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జి.ఓ.ఎం.ఎస్. నం.391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమి వర్గీకరణ మార్పునకు అనుమతి ఇచ్చింది. బీఎస్వో-15 నిబంధనల ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు మంజూరు ,చేసింది. మొత్తం 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిలో డీకేటీ పట్టాలతో హక్కు లభించింది. .ఈ లబ్ధిదారుల్లో 253 బీసీ, 10 ఓసీ, 13 ఎస్సీ, 46 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి భూమిపై చట్టబద్ధ హక్కు కల్పించి రైతు కుటుంబాలకు భద్రత, గౌరవం లభించింది.
