రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాదె మహేందర్ రెడ్డి…

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ రఘునాథపల్లి మండల అధ్యక్షులుగా మండల కేంద్రం చెందిన గాదె మ హేందర్ రెడ్డిని నియమిస్తూ పిసిసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ గ్రామాన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలు కాపాడుకుంటానని అన్నారు.

సహకరించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ కడియ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి, స్టేషనఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిరా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సీనియర్ జిల్లా నాయకులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.