గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని పాదయాత్ర

గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని పాదయాత్ర

దండేపల్లి, ఆంధ్రప్రభ: గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ రావ్ చేపట్టిన పాదయాత్ర బుధవారం దండేపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన దండేపల్లి మండల కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న గో హత్యలు నిషేదించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, 4వ సారి కూడా నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి కావాలని, అఖండ భారత్ నిర్మాణం జరగాలనే సంకల్పంతో హనుమాన్ భక్తుడు కాషాయ జెండాతో జై శ్రీరామ్ అనే నినాదాలతో ఈ నెల 11న 12జ్యోతిర్లింగాలు, భారత్ కె చార్ధమ్ మహా పాదయాత్ర ప్రారంభించానాని అన్నారు.