మహిళా భద్రతకై షీ టీం భరోసా అవగాహనా కార్యక్రమం
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని కనకపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రదేశం వద్ద శనివారం షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ సేఫ్టీ అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా షీ టీం భరోసా ఏస్ఐ నర్సయ్య మాట్లాడుతూ మహిళలు పని ప్రదేశంలో కానీ, మరెక్కడా అయిన ఎలాంటి ఇబ్బంది ఎదురైనా షీ టీం కు సమాచారం అందించాలని సూచించారు. మహిళ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని, మహిళాలు అన్ని రంగాల్లో రాణించాలి అని స్థానిక సర్పంచ్ సంగం రాజ్యలక్ష్మి వెంకట్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.
