21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి సేవా సమితి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్. శ్యాంసుందర్ తెలిపారు. స్థానిక కృష్ణ కాలనీలోని సి.ఈ.ఆర్ క్లబ్‌లో డా. విశ్వనాథ మహర్షి, ఆయుర్వేద నిపుణుడు నేతృత్వంలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది.
ఈ శిబిరం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కొనసాగనుంది. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండె దడ, రక్తపోటు, షుగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్థమా, స్త్రీలకు సంబంధించిన వ్యాధుల నివారణకు సంబంధించి ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు డా. విశ్వనాథ మహర్షి సెల్ నంబర్ 9849574706 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
