మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

రాయపర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా సంఘం నిర్వహణలో బుధవారం మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఇల్లంద మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400/- చొప్పున మక్కలను కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు తేమ శాతం 14 మించకుండా, శుభ్రం చేసిన మక్కలను కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, నేరుగా కొనుగోలు కేంద్రంలోనే మక్కలు విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులు, తూకం, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా సంఘం ప్రతినిధులు ఐత బ్రహ్మం, వశపాక సుధాకర్, మండల వ్యవసాయ శాఖ అధికారి వీరబ్రహ్మం, స్థానిక సర్పంచ్ గారే సహేంద్రబిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, ఉప సర్పంచ్ మచ్చ రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు పెండ్లి మహేందర్ రెడ్డి, తీగల సాయిలు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌లు ఎండి నయీమ్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ పుల్లూరి దామోదర్, స్థానిక నాయకులు మల్యాల నరసింహమూర్తి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.