పెరిగిన ఉష్ణోగ్రతలు.. రహదారిపై ద్విచక్ర వాహన దగ్ధం
పెరిగిన ఉష్ణోగ్రతలు.. రహదారిపై ద్విచక్ర వాహన దగ్ధం
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ఎండ వేడి తీవ్రత కారణంగా తల్లాడ కొత్తగూడెం రాష్ట్రీయ రహదారిపై ద్విచక్ర వాహనం దగ్ధమైంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలోని సీతారామ ప్రధాన కాల్వ పైన నిర్మించిన బ్రిడ్జి సమీపంలో టూ వీలర్ అగ్ని ప్రమాదానికి గురై దహనమైంది. తల్లాడ వైపు నుంచి జూలూరుపాడుకు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని రోడ్డు పక్కన ఒదిలివేసాడు.
మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయం, వేసవి ఎండల తీవ్రత, వేడి గాలులు ఎక్కువగా ఉండటం వాహనం నుంచి మంటలు ఒక్క సారిగా ఎగిసిపడటంతో టూ వీలర్ పూర్తిగా కాలిపోయింది. వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. పగటి ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా జూలూరుపాడు మండలంలో ఉస్త్నోగ్రతలు 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయని, వేడిని తట్టుకోలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వేడికి ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
