టాప్‌ ర్యాంకర్లకు ఘన సన్మానం

టాప్‌ ర్యాంకర్లకు ఘన సన్మానం

రాయపోల్, ఆంధ్రప్రభ:
పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలోని విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని పీఎం జడ్పీహెచ్ఎస్ రాయపోల్‌లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు మర్మాముల నాగరాజు చేతుల మీదుగా అభినందనలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పరీక్షల్లో సిహెచ్. సంపత్ (527/600) ప్రథమ స్థానం, ఐ. యుగేందర్ (523/600) ద్వితీయ స్థానం, ఎం. శృతి (522/600) తృతీయ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.