సిద్దిపేట జిల్లా గజ్వేల్ రింగ్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.కారు గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. మృతులను గోదావరిఖనికి చెందిన దినేశ్ (28), లింగం (48)గా గుర్తించారు. డ్రైవర్ ప్రణయ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయని, అతడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ దావాఖానకు తరలించామన్నారు. ప్రమాదం ధాటికి కారు ముందుకుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.