మంత్రి పొన్నంకు బీజేపీ నాయ‌కుడి విజ్ఞ‌ప్తి

మంత్రి పొన్నంకు బీజేపీ నాయ‌కుడి విజ్ఞ‌ప్తి

కోహెడ అక్టోబర్ 16 ( ఆంధ్రప్రభ ) ప్రజా అవసరాలకు స్థానికంగా ల‌భించే ఇసుక‌ను తీసుకునేలా అనుమ‌తులు ఇవ్వాల‌ని బీజేపీ ఖ‌మ్మం జిల్లా కౌన్సిల్ స‌భ్యుడు వెంక‌టేశం తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు బుధవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రజావాసరాలకు ప్రభుత్వ పనులకు మండలంలోని 27 గ్రామాల్లో ఇసుక – మట్టి తీసుకొనేవిధంగా అనుమతులు ఇవ్వాలని, దానిని తరలించే ట్రాక్టర్లపై డ్రైవర్ ఓనర్స్ లపై చట్టపరమైన కేసులు పెట్టకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. అక్రమంగా తరలించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు.