ముగింపు ఉజ్జీవ సభలలో ఆత్మీయ దైవజనులు బ్రదర్ సంతోష్ రెడ్డిచే వాక్యోపదేశం

ముగింపు ఉజ్జీవ సభలలో ఆత్మీయ దైవజనులు బ్రదర్ సంతోష్ రెడ్డిచే వాక్యోపదేశం

మండల వ్యాప్తంగా క్రైస్తవ భక్తులు పాల్గొనడం శుభ సూచికం
మండల పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు అశోక్

ఆళ్లపల్లి మే 15 (ఆంధ్రప్రభ) మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన ఎదురుగా నిర్వహించిన మూడు రోజుల క్రైస్తవుల ఐక్యత రక్షణ సువార్త సభలు గురువారంరాత్రి ముగియడంతో మండల వ్యాప్తంగా భారీ జనసంఖ్యలో క్రైస్తవ భక్తులు విశ్వాసులు పాల్గొని దేవుని అనుగ్రహాలు ఆత్మవరాలు ఆత్మాభిషేకం దీవెనలు పొందుకోవడం జరిగిందని డివైన్ బృందం, పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు పరమ అశోక్ తెలిపారు.మూడు రోజులుగా జరిగిన ఉజ్జీవ సభలకు అంతర్జాతీయ దైవజనులు ఉపదేశకులు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రాంతం నుండి ఆత్మీయ వరాలతో అభిషేకం పొందిన బ్రదర్ సంతోష్ రెడ్డి పాల్గొని, క్రైస్తవుల ఐక్యత రక్షణ సువార్త వాక్యోపదేశం ఉపదేశించారు. ఏసుప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు తండ్రి దేవుని కృపావరం ప్రసంగాలు విశ్వాసులకు ఎంతో దోహదపడ్డాయి. దైవజనులు బ్రదర్ సంతోష్ రెడ్డి రాత్రి బలవంతమైన ప్రార్థన శక్తితో భక్తులకు ఆత్మీయంగా ఉత్సాహంగా ఉజ్వల భరితంగా వాక్యోపదేశం అందించారు.

దేవుడు లేఖన భాగంలో తెలిపినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, సర్వ సృష్టి కర్త తప్ప దీనిని ఎక్కువగా ప్రేమించరాదని, మోక్షమార్గానికి వెళ్లాలంటే సత్ప్రవర్తన నిష్కలంకమైన ప్రేమయానం, నిజజీవితం అసలు సిసలైన ఏసుక్రీస్తు ప్రభువు శిష్యుల తరహా భక్తిజీవితంలో జీవించాలని, ప్రతిఒక్కరూ ఇహలోక ఆశలు ధన వ్యామోహ కోర్కెలు కుటుంబ జీవితం విడనాడి నిగ్రహ శక్తిని పెంచుకోవాలని,క్రీస్తుకు అంకితమైన అపార ప్రేమతో జీవించాలని పలు ఆధ్యాత్మిక సాంఘిక సామాజిక సేవలపట్ల క్రైస్తవ భక్తులకు ఉపదేశించడం ఎంతో గమనార్హం. మండలంలో అనేక గ్రామాలలో నుండి వచ్చిన క్రైస్తవ భక్తులకు కొన్ని స్వస్థత వరాలను అద్భుతాలను పొందారని, రక్షణ ఉజ్జీవ సువార్త సభలు ఆత్మయబలం శక్తికి ఎంతో దోహదపడ్డాయని డివైన్ బృందం ఫెలోషిప్ కమిటీ విశ్వసించింది.

ఈవెన్ మినిస్ట్రీస్ రాజమండ్రి దైవ ప్రసంగికులు బ్రదర్ సిహెచ్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తులకు, ఆధ్యాత్మిక ఉజ్జీవ సభలు సందేశం మే12 నుండి14 వరకు మండలంలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. క్రైస్తవుల ఐక్యత రక్షణ సువార్త సభలు మండల వ్యాప్తంగా పలు చర్చిల్లోని క్రైస్తవ భక్తులు వందలాదిమంది భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవడం,ఆధ్యాత్మిక శక్తిని పవిత్ర ఆత్మ అభిషేక స్వస్థత వరాలతో నింపబడడం జీవుని యొక్క కృపావరమన్నారు. 3రోజులపాటు ఎంతో ఉత్సాహంతో క్రైస్తవ భక్తులకు విశ్వాసాన్ని నింపడంలో భక్తిపూర్వకమైన ప్రార్థన మెలుకువతో క్రైస్తవభక్తులను సిద్ధపాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం మండల పాస్టర్ల ఫెలోషిప్, డివైన్ ఆధ్వర్యంలో దైవజనులు బ్రదర్ సంతోష్ రెడ్డికి పట్టుశాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.

ఏదేమైనప్పటికీ మండలవ్యాప్తంగా యువతీ యువకులు మహిళలు పురుషులు చిన్నారి బాల బాలికలు నృత్యాలతో ఎంతో అంగరంగ వైభవంగా క్రైస్తవ ఉజ్జీవ రక్షణ సువార్త కూటములకు అధిక సంఖ్యలో పాల్గొనడం ఎంతో శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, వసంతరావు, జాషువా, ఇమ్మానుయేలు, ఆంధ్రయ, ప్రభుదాసు, దానియేలు, కొర్నేలు, ఏసేపు, రామ్మూర్తి, కృపావతి, పాల్ రాజ్, యాకోబు, ఆకుల, శ్రీనివాస్ పాల్ (రాంబాబు), జాన్ బాబు, జాన్ విక్టర్, సుధాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రోమన్ క్యాథలిక్ మిషన్ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, గోగ్గల శిరోమణి డివైన్ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply