రాయలసీమపై ఎల్నినో ప్రభావం ముప్పు

రాయలసీమపై ఎల్నినో ప్రభావం ముప్పు
తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: రాయల సీమ జిల్లాల్లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచే ఎల్ నినో ముప్పు పొంచి ఉంది అది కూడా జూన్-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో వచ్చే నైరుతి రుతుపవనాల ప్రభా వాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది. తీవ్రమైన నీటి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్న ఈ దశలో నీటి వినియోగ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని India Meteorological Department (ఐఎండి) హెచ్చరిస్తోంది.
వాతావరణ శాస్త్రం పరంగా పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల జరిగే వాతావరణ మార్పును ఎల్ నినో అంటారు. ప్రతి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు సంభ వించే ఈ మార్పులు రుతుపవనాల గమనాన్ని తగ్గించి,
వచ్చే జూన్ – సెప్టెంబర్ మధ్యలో గడ్డుకాలం
• నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గే ప్రమాదం • ముందు జాగ్రత్త అవసరంమంటున్న ఐఎండి వర్షాభావ ప్రభావాన్ని పెంపొందిస్తుంది. అదే సమయంలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతుందని సంబంధితశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. 2026 లో ఆఎల్ నినో ప్రభావం Andhra Pradesh రాష్ట్రం లోని ఉత్తరాంధ్ర, రాయల సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాలపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారం, పదిరోజుల క్రితం ఐ ఎం డి తాజా నివేది కలో పేర్కొంది. అందులోని మౌలిక అంశాల ప్రకారం ఆ ఎల్ నినో ప్రభావం రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా, Nandyal, YSR Kadapa, Kurnool జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
ప్రమాద సూచికలలో
ఖరీఫ్ సీజన్ కు ఎంతో అవసర మైన నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడం ఎండలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో “వడగాడ్పుల తీవ్రత పెరగడం”,, భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు, బావులు ఎండిపోవడం, Srisailam Dam వంటి జలాశయాల నీటిమట్టం తగ్గిపోవడం వంటి అంశాలున్నాయి. ఈ సమస్య ఈ ఏడాది జూన్ – సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆ నివేదిక పేర్కొంటోంది.
50 మండలాల్లో షాడో ఏరియాలు
ఇప్పటికే సంబంధిత జిల్లాల యంత్రాంగాలు రెండు రోజుల క్రితం దాదాపు 50 మండలాలను షాడో ఏరియాలుగా గుర్తించి బోరింగులు వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసాయి. ఇదికాక ఐఎండి హెచ్చరికల మేరకు ఈ ఖరీఫ్ లో నీ టి వినియోగం తక్కువగా అవసరమయ్యే పంటలు, తక్కువ కాలపరిమితి గల పంటలపై రైతులు దృష్టి సారించేలా చూడా ల్సివుంది. ఈ క్రమంలో నీళ్లు ఎక్కువగా అవ సరం అయ్యే వరి, వేరుశనగ, అరటి, పసుపు పంటల విస్తీర్ణం తగ్గించుకుని, తక్కువగా నీళ్లు అవసరమయ్యే రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ కేంద్ర నిపుణులు రైతులను చైతన్య పరిచే కృషిలో ఉన్నారు. జిల్లాల అధికారులు వీటితో పాటు ఎండలను దృష్టిలో ఉంచు కుని తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తున్నారు. ఎల్ నినో వల్ల ఏర్పడే వర్షాభావ పరిస్థితుల గురించి గ్రామీణ ప్రజలను అవగాహన పెంపొందించే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
