కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
- టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని టీజీఐఐసీ చైర్ పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఎస్సీ సెల్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ రాజ బద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్ట పడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షేట్కార్, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సలాహాలు, సూచనలతో ఎస్సీ సెల్ నూతన కమిటీ ఏర్పాటు ఉంటుందని, అర్హులైన కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, జిల్లా నాయకుడు చిదృప్ప రఘురాంగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హనుమంతు యాదగిరి, ఉపాధ్యక్షుడు గంగేరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
