డొంక రహదారికి మహర్దశ
మైలవరం, ఆంధ్రప్రభ: ఎన్నో రోజులుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు జనసేన పార్టీ ముందడుగు వేసింది. వెల్వడం సచివాలయం–2 నుంచి పొలాలకు వెళ్లే డొంక రహదారిలో సుమారు 300 మీటర్ల మేర గ్రావెల్,కంకర రహదారిని జనసేన పార్టీ సహకారంతో నిర్మించారు.
జనసేన పార్టీ పీఏసీఎస్ చైర్మన్, కృష్ణాజిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పురుమ సతీష్ సొంత నిధులతో ఈ పనులు చేపట్టారు. జనసేన పార్టీ మైలవరం మండల కార్యదర్శి ఆకుతోట ఈశ్వర్, మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ పడిగల ఆధ్వర్యంలో రహదారి నిర్మాణ పనులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వెల్వడం గ్రామ ఉపాధ్యక్షులు లేళ్ల జగదీశ్, పడిగల నాగరాజు, నాయకులు ఆనం పూర్ణయ్య, అడ్డగిరి శివ, సాధం సాయి, జరుగు జితేంద్ర, రవేంద్ర, కిరణ్, హరిగోపి తదితరులు పాల్గొన్నారు.
