స్వామి ఆశీస్సులు ప్రజల పై ఉండాలి

స్వామి ఆశీస్సులు ప్రజల పై ఉండాలి

చిట్యాల, ఆంధ్రప్రభ: శ్రీ మహా లింగేశ్వర స్వామి ఆశీస్సులు చిట్యాల పట్టణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. మంగళవారం నాడు పుర పట్టణ పరిధిలో గల శివనేని గూడెం ఒకటో వార్డులో శ్రీ శ్రీ శ్రీ మహాలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దైద దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆయనను వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ -కావేరి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బీసీ యువజన సంఘం కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బొబ్బలి రాజిరెడ్డి, నూతి లింగస్వామి, చొప్పరి లింగస్వామి పాల మాకుల అర్జున్, అమ రోజు మహలింగం, నూతి కృష్ణ, తిమ్మయ్య, నాగరాజు, నవీన్, మల్లేష్, నరేష్ తదితరు పాల్గొన్నారు

Leave a Reply