వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న రేషన్ షాప్ డీలర్..
వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న రేషన్ షాప్ డీలర్..
వైద్యం కోసం ఆర్థిక సాయం..
దాతలకు గంగాపూర్ రేషన్ షాప్ డీలర్ వెడమ లచ్చయ్య వినతి..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని గంగాపూర్ రేషన్ షాప్ డీలర్ వెడ్మ లచ్చయ్య ఇటీవల వడ దెబ్బ తగిలి అనారోగ్యం పాలయ్యాడు అతనిని అతని కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స కోసం చేర్పించారు ఈ ప్రవేట్ హాస్పిటల్ లో రూపాయలు ఒక రోజు కు వైద్యానికి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటివరకు మూడు లక్షల రూపాయల వరకు లచ్చయ్య వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖర్చు చేయడం జరిగింది అయినా ఇంకా మూడు నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి వైద్య చికిత్సలు చేయించుకోవాలని వైద్యులు కోరారు లచ్చయ్య వైద్యం చేయించడానికి డబ్బులు లేక నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మీ కుటుంబ సభ్యులు చేర్పించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన ఒక వారము అవుతున్న కూడ లచ్చయ్యకు కడుపు నొప్పి మోషన్స్ ఆగడం లేదు తమకు వచ్చే రేషన్ షాప్ డీలర్ కమిషన్ జీతం నెలకు 5 వేల 500 రూపాయలు సరిపోక ఉండడానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు తమ వైద్యం కోసం దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించి తమకు ఆదుకోవాలని తెలంగాణ రేషన్ షాప్ డీలర్ ప్రెసిడెంట్ నిర్మల్ జిల్లా రాజేందర్ కు మరియు రేషన్ షాప్ డీలర్లకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు ప్రజలకు రేషన్ షాప్ డీలర్ వేడమా లచ్చయ్య కోరుతున్నారు. ఫోన్ పే నెంబర్ :8008447271 పై నెంబర్ కు ఆర్థిక సాయం డబ్బులు పంపించి తమకు ఆదుకోవాలని రేషన్ షాపు డీలర్ వేడమ లచ్చయ్య కోరారు.
