బాసరలో వైభవంగా…

బాసర, ఆగస్టు 22 (ఆంధ్ర ప్రభ ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి (Gnana Saraswati Devi) అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రావణ లక్ష్మి వ్రత (Sravana Lakshmi Vratham) పూజలు నిర్వహించారు.
అమ్మవారి సన్నిధిలోని సాధారణ అక్షరాబ్యాస మండపంలో అలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటాక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ (Naveen Sharma) పండితుల వేద మంత్రాలతో గణపతి పూజ, కలశ స్థాపన, రక్షా బంధనం పూజలు నిర్వహించి పాల్గొన్న మహిళల చే శ్రావణలక్ష్మి వ్రత పూజలు జరిపించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయం తరఫున ప్రసాద వితరణ (prasadam distribution) చేపట్టారు.
