రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఏఎంసీ చైర్మన్ భూషణ్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు.
మంగళవారం కడెం మండలంలోని బెల్లాల్ గ్రామంలో పాండవపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు తమ మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్, ఉప సర్పంచ్ అల్తాటి అనూష శ్రీనివాస్, ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ డి. రాజశేఖర్, పాండవపూర్ పీఏసీఎస్ సీఈఓ ఆశన్న, స్థానిక ఏఈఓ శాలిని, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల మల్లేష్ యాదవ్, రమేష్ రావు, బొడ్డు గంగన్న, తక్కల్ల సత్తన్న, నారాయణ, వీడీసీ అధ్యక్షులు పంచాయతీ శ్రీనివాస్ యాదవ్, రైతులు చెన్ను మల్లేష్, పన్నాల వెంకటేష్, గన్నే కొమురయ్య, ఎల్లకుర్తి మల్లేష్, కంఠం రవి తదితరులు పాల్గొన్నారు.
