రేపు మోత్కూర్ కి ఎమ్మెల్యే సామెల్ రాక
రేపు మోత్కూర్ కి ఎమ్మెల్యే సామెల్ రాక
మోత్కూర్, ఆంధ్రప్రభ: రేపు (సోమవారం) మోత్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ముఖాముఖి కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొననున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పాటిమట్ల గ్రామంలోని ఎస్సి కాలనిలో ప్రజలతో ముఖాముఖి , దాచారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల లో వంట గది, టాయిలెట్స్ నిర్మాణ శంకుస్థాపన, మున్సిపల్ కేంద్రంలో 3 గంటలకు స్థానిక రహదారి బంగ్లాలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ లతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే సామెల్ పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
