పీఏసీఎస్ వద్ద భారీ క్యూ..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : యూరియా (urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నల్లగొండ (Nalgonda) జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద ఉన్న పిఎసిఎస్ (PACS) వద్ద శనివారం యూరియా కోసం రైతులు దాదాపు అర కిలో మీటర్ మేర క్యూలో నిలబడ్డారు.
పోలేపల్లి పీఏసీఎస్ (Polepalli PACS) కు యూరియా వచ్చిందన్న సమాచారంతో యూరియా కోసం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పిఎసిఎస్ కేంద్రానికి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు (Police) ఘటనా స్థలంలో ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాశారు.
కరీంనగర్ జిల్లాలో…
కరీంనగర్ జిల్లా (Karimnagar District) వెన్కేపల్లి-సైదాపూర్ ది విశాల సహకార సంఘం ముందు వేకువజాముననే చెప్పులతో రైతులు యూరియా కోసం భారీ క్యూ లైన్ కట్టారు.

