Minister | దిష్టిబొమ్మలు దహనం…

Minister | దిష్టిబొమ్మలు దహనం…

Minister | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అసభ్యంగా, అగౌరవంగా అనుచిత వాక్యలు చేసిన వైసిపి మాజీ మంత్రి, మాజీ శాసనసభ స్పీకర్ ఆంబటి రాంబాబు, మాజీ మంత్రి జోగి రమేష్ లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారిపై టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మునుగోడు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్, మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సిలువేరు రాజు, మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారవుని అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి గోగినేని కృష్ణ తేజ, నాయకులు బొంగు బాద్షా, ఉపేంద్రచారి, చెరుకు అశోక్, అంతటి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.