సహకార సంఘ పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ

సహకార సంఘ పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ: నాగిరెడ్డిపేట మండలంలో గల తాండూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి తో పాటు, పాలకవర్గం సభ్యులు మంగళవారం తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. గత డిసెంబర్ నెల 19వ తేదీన సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై పలువురు సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో, తిరిగి పాత పాలకవర్గాలకు పదవి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు నివ్వడంతో, జిల్లా సహకార సంఘాధికారి రామ్మోహన్రావు ఆదేశాల మేరకు మంగళవారం చైర్మన్ తో పాటు పాలకవర్గం సభ్యులు పదవి బాధ్యతలను స్వీకరించారు. సింగిల్ విండో చైర్మన్ గా తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించిన ఆకిడి గంగారెడ్డిని, రైతులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మురళి, సొసైటీ ఉపాధ్యక్షుడు బాబురావు, సభ్యులు సంగయ్య, స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టయ్య, సంజీవులు, హనుమంత్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

Leave a Reply