భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ కొద్దిగా భారాన్ని తగ్గించడం అభినందనీయమని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొరడి లింబాద్రి, (బద్రి)అన్నారు.భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం స్థానిక కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే సర్పంచ్ కొడిగెల శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డలకు ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అలాగే బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రకుమార్, రాష్ట్ర కో- ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,మైనింగ్ శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ లకు లబ్ధిదారులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి గంగాధర్, పంచాయతీ సెక్రటరీ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి,ఉప సర్పంచ్ బాశెట్టి రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు గట్టు మురారి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్ది అవినాష్, కొరడి రాజు, కొరడి లింబాద్రి, రాము, నాయకులు, వార్డ్ మెంబర్ లు వికాస్, మమత, సుమలత,బోల్ట్ రంగారెడ్డి, గిర్ని రాజు, విల్సన్, గంగాధర్ గౌడ్, గంగారెడ్డి ప్రభాకర్, గౌడ్, మంద భూమేష్ రెడ్డి,అశోక్, చిన్న కృష్ణగౌడ్, భాస్కర్, లబ్ధిదారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
