ఐర్లాండ్ పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే !!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 183 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.
ఆరంభంలో భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి ఐర్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుదిపేశాడు. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, శివమ్ దూబే ఒక వికెట్ సాధించారు.
ఒక దశలో 51/4తో కష్టాల్లో పడిన ఐర్లాండ్‌ను కెప్టెన్ లార్కన్ టక్కర్ (50), గారెత్ డెలానీ 49 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు. చివర్లో జార్జ్ డాక్రెల్ 19 పరుగులతో వేగంగా ఆడి స్కోరును 180 దాటించాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా (3/24), అర్ష్‌దీప్ సింగ్ (2/28), అక్షర్ పటేల్ (2/33) రాణించారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 57 పరుగులు ఇవ్వగా, వాషింగ్టన్ సుందర్ వేసిన ఏకైక ఓవర్‌లోనే 19 పరుగులు రావడం భారత్‌కు కొంత ప్రతికూలంగా మారింది. ఇప్పుడు టీమిండియా విజయానికి 183 పరుగులు అవసరం.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో ఆసక్తికరంగా మారింది.
