Terrible incident | పాత కక్షలతో కుటుంబంపై దాడి

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లాలో జూనియర్ లాయర్ ఎల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో అతని కుటుంబంపై దుండగులు దాడి చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జూనియర్ లాయర్ ఎల్లయ్య కుటుంబంపై గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఈ దాడిలో ఎల్లయ్య తీవ్రంగా గాయపడి మృతిచెందగా, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
