Telugu serial actress | కన్నడ నుంచి తెలుగు వరకు నటనా ప్రయాణం
Telugu serial actress | కన్నడ నుంచి తెలుగు వరకు నటనా ప్రయాణం
Telugu serial actress | వర్షిక నాయక్ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు
అన్నపూర్ణ క్యాటరింగ్ సెట్‌లో మధుర అనుభవాలు
యమున గారితో భావోద్వేగ అనుబంధం
1000 ఎపిసోడ్‌ల అరుదైన మైలురాయి
Telugu serial actress |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ‘అన్నపూర్ణ క్యాటరింగ్’ సీరియల్ కథానాయిక వర్షిక నాయక్ తాజాగా ‘ఆంధ్రప్రభ’తో తన మనసులోని మాటలను పంచుకున్నారు. షూటింగ్ సెట్‌లోని సరదా ముచ్చట్లతో పాటు తన కెరీర్, సీనియర్ నటి యమున గారితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే భోజనం గుర్తొస్తుంది!
సీరియల్ పేరుకు తగ్గట్టే షూటింగ్ సెట్‌లో భోజనం చాలా అద్భుతంగా ఉంటుందని వర్షిక చమత్కరించారు. “అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అక్కడ వడ్డించే ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది. భోజనం బాగుండటంతో నేను కూడా కాస్త ఎక్కువగానే తింటాను. నిజం చెప్పాలంటే ఆ రుచికరమైన భోజనం వల్లే నేను కొంచెం లావు అయ్యాను” అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. సెట్‌లో అందరం ఒకే కుటుంబంలా కలిసి భోజనం చేయడం ఒక మధురమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు.

నటనా ప్రయాణం – కన్నడ నుంచి తెలుగు వరకు:
తన నటనా ప్రయాణం గురించి వివరిస్తూ.. వర్షిక ఇప్పటివరకు కన్నడలో ఐదు ప్రాజెక్టులలో నటించినట్లు వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులకు ‘మౌనపోరాటం’ సీరియల్ ద్వారా దగ్గరైన ఆమె, ప్రస్తుతం ‘అన్నపూర్ణ క్యాటరింగ్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. భాష ఏదైనా నటనపై ఉన్న మక్కువతో తాను ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
యమున గారితో ఆత్మీయ అనుబంధం:
ఈ సందర్భంగా సీనియర్ నటి యమున గారిపై వర్షిక తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. “యమున మేడం నాకు సెట్‌లో మరో తల్లి లాంటి వారు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెది చాలా స్వచ్ఛమైన మనసు. నాకు ఎలాంటి కష్టం వచ్చినా, మనసు బాధగా ఉన్నా వెంటనే ఆమెతో పంచుకుంటాను. నా ప్రతీ ఇబ్బందిని ఆమె తన సొంత బిడ్డ సమస్యలా వింటారు” అని వర్షిక భావోద్వేగానికి లోనయ్యారు.

అరుదైన రికార్డు.. 1000 ఎపిసోడ్‌ల ప్రయాణం:
యమున గారితో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొన్న వర్షిక, గత నాలుగు సంవత్సరాల్లో తామిద్దరం కలిసి సుమారు 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేయడం విశేషమని చెప్పారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించడం చాలా సంతోషంగా ఉందని, ఈ విజయంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందని ఆమె వెల్లడించారు.
వర్షిక నాయక్ పంచుకున్న మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ఆమె షూటింగ్ లోకేషన్ ముచ్చట్లు తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.
