In America Man Hunt : ఉన్మాది కాల్పులు
In America Man Hunt : ఉన్మాది కాల్పులు
బ్రౌన్ వర్పిటీలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
8 మంది ఆసుపత్రిపాలు
అమెరికాలో తుపాకీ అలజడి
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
అమెరికాలో ఓ ఉన్మాది (Maniac ) రెచ్చిపోయాడు. గ్రేటర్ బ్రౌన్ విశ్వవిద్యాలయంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై (Man Hunt) కాల్పులకు తెగబడ్డాడు. ఈ కిరాతక ఘటనలో ఇద్దరు విద్యార్థులు (2 Students Dead) అక్కడిక్కడే మృతి చెందారు. 8 మంది తీవ్రంగా ( 8 Injured) గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడు తాపీగా వర్సిటీ భవనం నుంచి నడుచుకుంటూ వెళ్లిపాయాడు.
In America Man Hunt

ఈ ఘటనతో అమెరికాలోని రోడ్ ఐలాండ్ (Road Island) ప్రావిన్స్ లో కలకలం రేగింది. యూనివర్సిటీలోని విద్యార్థులను రక్షించేందుకు సుమారు 400 మంది భద్రత సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. హంతకుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఈ మ్యాన్ హంట్ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం, శనివారం సాయంత్రం 16:05 గంటలకు రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం (Brown University) ( ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం) లో నల్లటి దుస్తులు ధరించిన ఓ యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం కాలినడకన తాపీగా వెళ్లిపోయాడు.
In America Man Hunt

ఆ సమయంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ బిల్డింగ్ లో విద్యార్థులు (Final Exmas) ఫైనల్ పరీక్షలు రాస్తున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్సందించారు. కాల్పుల తనకు సమాచారం అందినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. FBI, ATF సహా 400 మందికి పైగా దర్యాప్తు సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నట్టు ఆయన వివరించారు. ఫైనల్స్ పరీక్షలు ముగిశాయి, క్రిస్మస్ పండక్కి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ కిరాతకం జరిగిందని, ఇద్దరు చనిపోవటం హృదయ విదారక ఘటనగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
In America Man Hunt : దర్యాప్తు చకచక

బ్రౌన్ యూనివర్సిటీలో నేరస్థలి (Crime Scene) నుంచి షెల్ కేసింగ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం (Seized) చేసుకున్నారని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. కాల్పుల తర్వాత దుండగుడు హోప్ స్ట్రీట్‌లో (In Hope Street) నడుస్తున్నట్లు వీడియోలో (Acused Escape) కనిపించాడు. అతను ముదురు రంగు దుస్తులు ధరించాడు. నిందితుడి ముఖం కనిపించడం లేదు, అతను బూడిద రంగు ముసుగు ధరించినట్టు సాక్షులు చెబుతున్నారని ప్రావిడెన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ తిమోతి ఓహారా తెలిపారు.
In America Man Hunt

ఇక యూనివర్సిటీ భవనాలను అధికారులు సోదా చేశారు, కాల్పులు జరిపిన నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. తమను తాము రక్షించుకునేందుకు తరగతి గదుల ఎదుట బారికేడ్లు వేసుకున్నారు. అక్కడికి చేరుకున్న అధికారులు తరగతి గదులను (Class Rooms Vacated) ఖాళీ చేయించారు. పోలీసులు ఇంజనీరింగ్ భవనాన్ని తనిఖీ చేశారు. కానీ అనుమానితుడిని గుర్తించలేదని ప్రావిడెన్స్ పోలీసు డిప్యూటీ చీఫ్ టిమ్ ఓహారా తెలిపారు.
In America Man Hunt : బాధితులకు రక్షణగా…

సాయంత్రం 4:05: మొదటి 911 కాల్ వచ్చింది, అప్పటికే ఇద్దరు చనిపోయారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించామని ప్రావిడెన్స్ మేయర్ స్మైలీ తెలిపారు. అదే సమయంలో ఈ షూటర్ కోసం (Shooter) తన బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు ప్రావిడెన్స్ అగ్నిమాపక అధికారి డెరెక్ సిల్వా తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం, సాయంత్రం 4:22 గంటలకు విశ్వవిద్యాలయం తన తొలి హెచ్చరికను విడుదల చేసింది, బారస్ & హోలీ ఇంజనీరింగ్ సమీపంలో మ్యాన్ హంటర్ ఉన్నాడు అని పేర్కొంది.
In America Man Hunt

సాయంత్రం 5:11: బ్రౌన్ కమ్యూనిటీ సభ్యులకు ఆశ్రయం కొనసాగించాలని వర్సిటీ అధికారులు కోరారు. సాయంత్రం 5:27: గవర్నర్ స్ట్రీట్ సమీపంలో మరొక ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు వర్సిటీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 6:10 గంటలకు ఈ సమాచారాన్ని ఖండించారు. సాయంత్రం 6:33: ఇద్దరు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని, ఆసుపత్రిలో ఉన్నారని బ్రౌన్ వర్సిటీ ప్రకటించింది. రాత్రి 7:38: విశ్వవిద్యాలయాన్ని (Varsity Lock Down) లాక్‌డౌన్‌లో చేశారు.
A:O READ : Geminids Show : వావ్..వెలుగు పూల వాన
