Telangana | సంక్షేమానికి, మహిళాభివృద్ధికి తొలి ప్రాధాన్యత
Telangana | సంక్షేమానికి, మహిళాభివృద్ధికి తొలి ప్రాధాన్యత
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెడుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, తమ ప్రభుత్వ లక్ష్యాలను, ప్రాధాన్యతలను సభకు వివరించారు.
బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడీ కాదని.. వాస్తవాలకు దగ్గరగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించామన్నారు. గొప్పల కోసం తాము ఎప్పుడూ అబద్ధాలు చెప్పబోమన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, మహిళాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా కీలక కేటాయింపులు చేసినట్లు సూచించారు.
