Census Delay | 20 శాతం కూడా పూర్తికాని జనగణన

Census Delay | 20 శాతం కూడా పూర్తికాని జనగణన

Census Delay | అమరావతి, ఆంధ్రప్రభ : జనగణన ప్రక్రియపై ఎండల ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో ఎన్యూమరేటర్లు ఉదయం, సాయంత్రం వేళ ల్లోనే ఇళ్లను సందర్శించి గణాంకాలు సేకరించా లని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికితోడు 33 ప్రశ్నలు ఉండడంతో ఒక్కో ఇంటి వద్ద సుమారు 25 నుంచి 30 నిమిషాల సమయం పడు తుండడంతో గణన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ సారి జనగణన ప్రక్రియ డిజిటల్ విధానం లో ప్రభుత్వం చేపట్టింది.

ఎన్యూమరేటర్లు సీఎంఎంఎస్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. ఫలితంగా ఒక ఇంటి వద్ద కనీసం 25 నుంచి 30 నిమిషాలకు వరకు సమయం పడుతోంది. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 20 నుంచి 25 ఇళ్ల గణన చేయాలని లక్ష్యం విధించగా.. 15 గృహా లకు మించి పూర్తి కావడంలేదు. ఈ పరిస్థి తుల్లో నెలాఖరుకు గణన పూర్తికావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. 30లోగా పూర్తి చేయాలి ప్రభుత్వం ఈనెల 1న ప్రారంభించిన జనగణన ప్రక్రియ ఈనెల 30లోగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే డిజిటల్ విధానం కావడం, ఒక్కోసారి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవ్వడం, ఎండల ప్రభావం తదితర కారణాలతో లక్ష్యాల సాధన కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గణనలో మొత్తం 33 అంశాల్ని గణకులు సేకరిస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.

ఇవన్నీ కుటుంబ సభ్యులను అడిగే తరుణంలో ఒక్కోసారి మరింత జాప్యం జరుగుతుంది. ఒక్కో ఇంటి వద్ద 25 నుంచి 30 నిమిషాల పైనే సమయం పడుతుండడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆరు గంటలు మాత్రమే విధులకు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో 6 సిబ్బంది వడదెబ్బబారిన పడకుండా ఉండే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో సిబ్బంది ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విరామమిస్తున్నారు. ఫలితంగా రోజుకు ఆరు గంటలకు మించి ప్రక్రియ జరగడం లేదు.

ఆర్డీవోలు, తహసీల్దార్లు, పుర పాలక కమి షనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి గృహాల గణన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఆన్లైన్లో వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నారు.20 శాతం కూడా పూర్తి కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనగణన ప్రక్రియ పది రోజులైనప్పటికీ కనీసం 20 శాతం కూడా పూర్తికాక పోవడంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈనెల 20 నాటికే పూర్తిచేయాలని టార్గెట్లు కూడా ఇచ్చారు. అయితే ఎన్యూమరేటర్లు మాత్రం ఒక్కో ఇంటివద్దే అధిక సమయం పట్టడం వల్లే ఆలస్యమవుతుందని సరైన వివరాలు నమోదు చేయకుంటే ఇబ్బంది పరిస్థితులు తలెత్తే ప్రమాద ముందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా స్వీయ గణన ప్రక్రియను ఎక్కువ మంది వినియోగించు కోక పోవడం కూడా ఒక కారణమని అధికారులు చెబు<br>తున్నారు. ఆన్లైన్ పరిజ్ఞానం పెరిగినప్పటికీ ప్రభుత్వం పదే పదే ప్రచారం చేసి 15 రోజులు గడువు ఇచ్చి నప్పటికీ ఆశించిన స్థాయిలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరగలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి చేపట్టి ఉంటే జనగణన ప్రక్రియకు కొంత దోహదపడేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply