Andhra Pradesh weather | ఏడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

Andhra Pradesh weather | ఏడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

Andhra Pradesh weather | 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
14 జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

Andhra Pradesh weather | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విభిన్న వాతా వరణం నెలకొంటోంది. ఓవైపు భానుడి భగభగలతో సెగలు పుట్టిస్తుండగా, మరోవైపు వరుణుడు కూడా కరుణ చూపుతూ జల్లులు కురిపిస్తున్నాడు. కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నందనమారెళ్లలో 45.2డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

గురువారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. పల్నాడు 16, ప్రకాశం 15, బాపట్ల 13, ఎన్టీఆర్ 12, కృష్ణా 12, గుంటూరు 12, ఏలూరు 6, మార్కాపురం 6, నెల్లూరు 6 మండలాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా చూపిందన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.4, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.1, గుంటూరు జిల్లా పాండ్రపాడులో 44, బాపట్ల జిల్లా మార్టూరు, నెల్లూరు జిల్లా గూడూరులో 43.8, పోలవరం జిల్లా చింతూరులో 43.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43, చిత్తూరు జిల్లా నిండ్ర, విశాఖ జిల్లా ములగాడలో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

నేడు 46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం

కాగా శుక్రవారం 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖరైన్ తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డీగ్రీల వరకు నమోదవుతాయన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

నేడు పలు జిల్లాల్లో వర్షాలు

విస్తరించి ఉందని ఏపిఎస్జీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనిప్రభావంతో శుక్రవారం మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Leave a Reply