Telangana Politics | కాంగ్రెస్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
Telangana Politics | కాంగ్రెస్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
Telangana Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై విష ప్రచారం చేయడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ సాధించిన పురోగతిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం.. పాలనలో తప్పిదాలతో తెలంగాణను 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ “దరిద్రం” ఇప్పుడు తెలంగాణకు పట్టుకుందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు అందరూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధి–సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లిన రాష్ట్రంగా పేరు తెచ్చుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడి తప్పిందని, ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ విజయాలను
