fake news alert | అపోహ‌లొద్దు.. చలామ‌ణిలోనే రూ.500 నోట్లు

హైద‌రాబాద్ : నోట్ల రద్దు అంటేనే ప్రజల్లో ఒక భయం పుడుతుంది. తాజాగా రూ.500 నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్సీబీ కీలక ఆదేశాలు ఇచ్చిందని, బ్యాంకులు తర్వాత రూ.500నోట్ల సరఫరా తగ్గించాలని, ఏటీఎంలలో కూడా రూ.500 తగ్గిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అసలు రూ.500 నోటు కనిపించకుండా చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఆర్బీఐ వివ‌ర‌ణ ఇచ్చింది.. అన్ని ఏటీఎంలలో 2025 సెప్టెంబర్ 30 నాటికి 75శాతం, 2026 మార్చి 31నాటికి 90శాతం రూ.100 లేదా రూ.200 నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించింది ఆర్బీఐ. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది.. అంతేకానీ, రూ.500నోట్ల రద్దు ఉండద‌ని పేర్కొంది.

Leave a Reply