110 మందికి ఉచిత కంటి పరీక్షలు..
- 25 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు
మైలవరం, ఆంధ్రప్రభ : లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో విజయవాడ వాసన్ కంటి ఆసుపత్రి సహకారంతో శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 110 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు లైన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. పరీక్షల్లో 25 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వారికి త్వరలో విజయవాడలోని వాసన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు, వాసన్ ఐ కేర్ సిబ్బంది పాల్గొన్నారు
