తెలంగాణ దినోత్సవం: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ దినోత్సవం: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని ఆయన గుర్తు చేశారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతి సంవత్సరం.. నిన్నటి త్యాగాలను స్మరిస్తూ.. రేపటి లక్ష్యాలను సమీక్షించుకునే.. భావోద్వేగ సందర్భం.. జూన్ 2. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.